Header Banner

గూడూరు స్టేషన్ కి రైల్వేశాఖ గుడ్ న్యూస్! భారీ నిధులతో.. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం!

  Thu Mar 13, 2025 20:51        Others

నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్ కు రైల్వే శాఖ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై మార్గంలో కీలక రైల్వే జంక్షన్ అయిన గూడూరు రైల్వే స్టేషన్ రూపురేఖల్ని మార్చేందుకు వీలుగా భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈ నిధులతో గూడూరు రైల్వే స్టేషన్లో పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. వీటి వివరాలను కూడా రైల్వే శాఖ విడుదల చేసింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. గూడూరు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి రూ.49.18 కోట్ల భారీ మంజూరును మంజూరు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంతంలో ప్రయాణికుల భవిష్యత్ వృద్ధికి అనుగుణంగా, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరిచేలా పలు సౌకర్యాలను ఈ నిధులతో ఏర్పాటు చేయబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలక స్టేషన్లను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా గూడూరు స్టేషన్ కు ఈ నిధులు కేటాయించారు.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ


ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్టేషన్ ను ఆభివృద్ధి చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక మైలురాయి సౌకర్యంగా గూడూరు స్టేషన్ ను అభివృద్ధి చేయబోతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా గూడూరు స్టేషన్లో గ్రౌండ్ + 2 అంతస్తులతో కూడిన కొత్త స్టేషన్ భవనం ఏర్పాటు చేస్తారు. అలాగే గూడూరు స్టేషన్లో 1 నుండి 5 వరకు ప్లాట్‌ఫారమ్‌ల పూర్తి పొడవు కోసం కవర్ ఓవర్ ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు, తూర్పు నుండి పడమర ప్రవేశ ద్వారం వరకు 12 మీటర్ల వెడల్పు గల రూఫ్ ప్లాజా, స్టేషన్ భవనంతో లింక్ చేయనున్నారు. అలాగే సర్క్యులేటింగ్ ఏరియాలో మార్పులు చేయడం, స్టేషన్ భవనానికి కొత్త ముఖద్వారం ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #railway #station #development #todaynews #flashnews #latestnews